అమ్మో పాప కంటి నుంచి ప్లాస్టిక్, ఇనుము

మహబూబాబాద్ జిల్లాలో ఓ పాపకు ఎవరికీ రాని కష్టం వచ్చింది. పది రోజులుగా ఆ చిన్నారి నరకాన్ని చూస్తోంది. గార్ల మండలం కృష్ణాపురంలో ఆ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సౌజన్య అనే పాప కంట్లో నుంచి వివిధ పదార్థాలు బయటకు రావడం సంచలనం రేపుతోంది. భూక్య బాలు కూతురు సౌజన్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలతో ఒకటో తరగతి చదువుతోంది.
గత పది రోజులుగా కుడి కన్నులోంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు, బియ్యపు గింజలు జారిపడుతున్నాయి. దాంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తమకు ఆర్థిక స్థోమత లేక పెద్ద హాస్పిటల్స్‌కు తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాపను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అటు ప్రస్తుతం పాపను కుటుంబసభ్యులు, బంధువులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

