BRS: గులాబీ పార్టీకి మళ్లీ గుర్తుల గుబులు

BRS: గులాబీ పార్టీకి మళ్లీ గుర్తుల గుబులు
X
జూబ్లీహిల్స్ బై పోల్‌లో గుర్తుల కేటాయింపు.. స్వతంత్ర్య అభ్యర్థులకు సింబల్స్ ఇచ్చిన ఈసీ.. అభ్యర్థులకు కారు గుర్తును పోలిన గుర్తులు ##

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లు అన్ని పా­ర్టీ­ల­కు ప్ర­తి­ష్టా­త్మ­కం­గా మా­రా­యి. తా­జా­గా అభ్య­ర్థు­ల­కు ఈసీ సిం­బ­ల్స్ కే­టా­యిం­చిం­ది. ఎన్ని­కల సిం­బ­ల్స్ లో బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ ఎన్ని­కల గు­ర్తు కా­రు­ను పో­లిన సిం­బ­ల్స్ ఉం­డ­టం­తో ఆ పా­ర్టీ తలలు పట్టు­కుం­టుం­ది. . వందల సం­ఖ్య­లో నా­మి­నే­ష­న్లు వే­సి­న­ప్ప­టి­కీ అం­ద­రూ ఉప­సం­హ­రిం­చు­కో­వ­డం­తో బరి­లో 58 మంది అభ్య­ర్థు­లు ఉన్న­ట్లు ఎన్ని­కల సంఘం ప్ర­క­టిం­చిం­ది. కాగా అభ్య­ర్థు­ల­కు తా­జా­గా ఈసీ ఎన్ని­కల సిం­బ­ల్స్‌ కే­టా­యిం­చిం­ది. దీం­తో అభ్య­ర్థు­లం­తా ప్ర­చా­రా­న్ని ము­మ్మ­రం చే­శా­రు. ఇదం­తా బా­గ­నే ఉన్న­ప్ప­టి­కీ తమ సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని ఎలా­గై­నా దక్కిం­చు­కో­వా­ల­ని చూ­స్తు­న్న బీ­ఆ­ర్ఎ­స్‍కు జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో­నూ గు­ర్తుల టె­న్ష­న్ తప్పే­లా లేదు. తా­జా­గా అభ్య­ర్థు­ల­కు ఈసీ ప్ర­క­టిం­చిన ఎన్ని­కల సిం­బ­ల్స్ లో బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ ఎన్ని­కల గు­ర్తు కా­రు­ను పో­లిన సిం­బ­ల్స్ ఉం­డ­టం­తో ఆ పా­ర్టీ తలలు పట్టు­కుం­టుం­ది.

గతంలోనూ తిప్పలు

తమ సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని ఎలా­గై­నా దక్కిం­చు­కో­వా­ల­ని చూ­స్తు­న్న బీ­ఆ­ర్‌­ఎ­స్‌­కు.. గతం­లో మా­ది­రి­గా­నే ఈ ఉప ఎన్ని­క­లో­నూ గు­ర్తుల టె­న్ష­న్ తప్పే­లా లేదు. బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఎన్ని­కల గు­ర్తు అయిన కా­రు­ను పో­లిన సిం­బ­ల్స్ పలు స్వ­తం­త్ర అభ్య­ర్థు­ల­కు, చి­న్న పా­ర్టీ­ల­కు కే­టా­యిం­చ­డం ఆ పా­ర్టీ­ని కల­వ­ర­పె­డు­తోం­ది. ము­ఖ్యం­గా రోడ్ రో­ల­ర్, చపా­తీ మే­క­ర్ వంటి గు­ర్తు­లు తమ ఓట్ల­ను గల్లం­తు చే­స్తా­య­నే భయం బీ­ఆ­ర్‌­ఎ­స్‌ నా­య­కు­ల్లో ఉంది.గతం­లో జరి­గిన చాలా ఎన్ని­క­ల్లో కారు గు­ర్తు­ను పో­లిన సిం­బ­ల్స్ కా­ర­ణం­గా వృ­ద్ధ ఓట­ర్లు, దృ­ష్టి­లో­పం ఉన్న­వా­రు తి­క­మ­క­ప­డి తప్పు­డు గు­ర్తు­కు ఓటు వే­శా­ర­ని, దా­ని­వ­ల్ల తమకు నష్టం జరి­గిం­ద­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ నే­త­లు చాలా కా­లం­గా ఆవే­దన వ్య­క్తం చే­స్తు­న్నా­రు. అం­దు­కే రోడ్ రో­ల­ర్, చపా­తీ మే­క­ర్, సోప్ బా­క్స్, కె­మె­రా వంటి సిం­బ­ల్స్‌­ను రద్దు చే­యా­ల­ని గతం­లో ఈసీ­కి వి­జ్ఞ­ప్తి కూడా చే­శా­రు. కానీ, జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లో తా­జా­గా కే­టా­యిం­చిన గు­ర్తు­ల్లో మళ్లీ అవే సిం­బ­ల్స్ కని­పిం­చ­డం­తో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ టె­న్ష­న్ రె­ట్టిం­పైం­ది. బ్యా­లె­ట్ పే­ప­ర్‌­లో గు­ర్తుల స్థా­నా­ల­ను పరి­శీ­లి­స్తే... బీ­జే­పీ అభ్య­ర్థి లంకల దీ­ప­క్ రె­డ్డి­కి (కమలం) మొ­ద­టి స్థా­నం, కాం­గ్రె­స్ అభ్య­ర్థి నవీ­న్ యా­ద­వ్‌­కు (హస్తం) రెం­డో స్థా­నం, బీ­ఆ­ర్‌­ఎ­స్ అభ్య­ర్థి మా­గం­టి సు­నీత గో­పీ­నా­థ్‌­కు (కారు) మూడో స్థా­నం కే­టా­యిం­చా­రు. అయి­తే ఇదే ఈవీ­ఎం యూ­ని­ట్‌­లో కారు గు­ర్తు­కు దగ్గ­ర­గా ఉండే ఇతర సిం­బ­ల్స్ ఉన్నా­యి. 5వ నం­బ­ర్‌­లో సోప్ డిష్, 9వ నం­బ­ర్‌­లో చపా­తీ రో­ల­ర్, 13వ నం­బ­ర్‌­లో రోడ్ రో­ల­ర్, 21వ నం­బ­ర్‌­లో కె­మె­రా వంటి గు­ర్తు­లు ఉన్నా­యి. సా­ధా­ర­ణం­గా ఒక బ్యా­లె­ట్ యూ­ని­ట్‌­పై నో­టా­తో సహా 16 పే­ర్లు ఉం­టా­యి. అంటే, మొ­ద­టి ఈవీ­ఎం యూ­ని­ట్‌­లో­నే బీ­ఆ­ర్‌­ఎ­స్‌ కారు గు­ర్తు­తో పాటు దా­న్ని పో­లిన గు­ర్తు­లు ఉం­డ­టం వలన ఓట­ర్ల గం­ద­ర­గో­ళం పె­రి­గే అవ­కా­శం ఉంది. ఈ గు­ర్తుల గండం నుం­చి బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఈ ఉప ఎన్ని­క­లో ఎలా బయ­ట­ప­డు­తుం­దో అనే­ది ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది.

బీఆర్ఎస్ కు కొత్త టెన్షన్

ప్ర­ధాన పా­ర్టీల అభ్య­ర్థు­ల­కు గు­ర్తు­లు గు­బు­లు పు­ట్టి స్తు­న్నా­యి. తమ పా­ర్టీ గు­ర్తు­ను పో­లిన గు­ర్తు­లు పలు పా­ర్టీ­లు, స్వ­తం­త్ర అభ్య ర్థు­ల­కు కే­టా­యిం­చ­డం­తో ఆం­దో­ళన చెం­దు­తు­న్నా­రు. ము­ఖ్యం­గా బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ ఈ వి­ష­యం­లో మా­త్రం తెగ టె­న్ష­న్ పడు­తోం­ది. ఎన్ని­క­లు జరి­గిన ప్ర­తి­సా­రీ గు­లా­బీ దళం­లో ఇదే భయం కని­పి­స్తోం ది. తా­జా­గా జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లో పోటీ చే­స్తు­న్న రి­జి­స్ట­ర్ పా­ర్టీల, స్వ­తం­త్ర అభ్య­ర్ధు­ల­కు ఎన్ని­కల కమి­ష­న్ గు­ర్తు­లు కే­టా­యిం­చిం­ది. గతం­లో ఈ సిం­బ­ల్స్ తొ­ల­గిం­చా­ల­ని ఎన్ని­కల కమి­ష­న్కు బీ­ఆ­ర్ఎ­స్ వి­జ్ఞ­ప్తి చే­సిం­ది. కారు గు­ర్తు­కు దగ్గ­ర­గా ఉం­డ­టం­తో సిం­బ­ల్స్ గు­ర్తిం­పు­లో ఓట­ర్లు కన్ఫ్యూ­జ్ అవు­తు­న్నా రని ఆం­దో­ళన వ్య­క్తం చే­సిం­ది. ఇటీ­వల మాజీ మం­త్రి కే­టీ­ఆ­ర్ ఢి­ల్లీ వె­ళ్లి కేం­ద్ర ఎన్ని కల సం­ఘా­ని­కి ఇదే వి­ష­యం­పై ఫి­ర్యా­దు చే­శా­రు. జూ­బ్లీ­హి­ల్స్ అసెం­బ్లీ ఉప ఎన్నిక బరి­లో అభ్య­ర్థుల తుది జా­బి­తా ఇప్ప­టి­కే ఖరా­రైం­ది. నవం­బ­ర్ 11న పో­లిం­గ్ జరి­గే ఎల­క్ష­న్లో 58 మంది అభ్య­ర్థు­లు పోటీ పడు­తు­న్న­ట్లు­గా ఈసీ ప్ర­క­టిం­చిం­ది. మొ­త్తం 211 మంది నా­మి­నే­ష­న్లు వే­య­గా 81 మంది అభ్య­ర్థు­లు అర్హత పొం­దా­రు. వా­రి­లో మొ­త్తం 23 మంది నా­మి­నే­ష­న్ల­ను వి­శ్రా చే­సు­కో­గా.. 58 మంది బరి­లో ని­లి­చా­రు. అయి­తే, ఇంత మంది పోటీ చే­య­డం జూ­బ్లీ­హి­ల్స్ అసెం­బ్లీ ని­యో­జ­క­వ­ర్గ చరి­త్ర­లో ఇదే తొ­లి­సా­రి కా­వ­డం గమ­నా­ర్హం. ఇక 2009 ఎన్ని­క­ల్లో 13 మంది, 2014 ఎన్ని­క­ల్లో 21 మంది, 2018 ఎన్ని­క­ల్లో 18 మంది పో­టీ­ప­డ­గా.. 2023లో జరి­గిన ఎన్ని­క­ల్లో 19 మంది అభ్య­ర్థు­లు పో­టీ­ప­డ్డా­రు. వా­రి­లో బీ­ఆ­ర్ఎ­స్ అభ్య­ర్థి మా­గం­టి గో­పీ­నా­థ్ వి­జ­యం సా­ధిం­చా­రు. స్వ­తం­త్రు­లు, వి­ద్యా­ర్థి నా­య­కు­లు, రై­తు­లు బరి­లో­కి ది­గా­రు.

Tags

Next Story