asaduddin owaisi: లాక్డౌన్ పొడిగించొద్దు: ఒవైసి

asaduddin owaisi: లాక్డౌన్ పొడిగించొద్దు: ఒవైసి
X
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్‌ను ఇంకా పొడిగించవద్దని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ కు ట్వీట్ చేశారు.

asaduddin owaisi: లాక్డౌన్ పొడిగింపుతో సహా పలు అంశాలపై చర్చించడానికి రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ప్రగతి భవన్ లో సమావేశమైంది. అయితే ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్‌ను ఇంకా పొడిగించవద్దని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ కు ట్వీట్ చేశారు.

"లాక్డౌన్ పొడిగించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రిని గట్టిగా కోరారు. లాక్‌డౌన్‌ను తగ్గించడమే లక్ష్యం అయితే, సాయంత్రం 6 గంటల నుండి కర్ఫ్యూ విధించమని కోరారు. లేదా కోవిడ్ క్లస్టర్‌ల కోసం మినీ లాక్‌డౌన్‌ పై దృష్టి సారించండి అని సూచించారు.

దేశంలో అధిక శాతం జనాభా ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు. వారు పని చేసుకుంటే కానీ రోజు గడవదు. అలాంటి వారు కేవలం నాలుగు గంటల లాక్డౌన్ సడలింపుతో ఎలా జీవిస్తారు. ఇంకా లాక్డౌన్ పొడిగించడం అనేది సరైన నిర్ణయం కాదని ట్విట్టర్ లో ఒవైసి పేర్కొన్నారు.

Tags

Next Story