PM Modi : తెలంగాణ అభివృద్దిలో కేంద్రానిది ముఖ్య భూమిక : ప్రధాని మోదీ

PM Modi : తెలంగాణ అభివృద్దిలో కేంద్రానిది ముఖ్య భూమిక : ప్రధాని మోదీ
X
2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల హైవే ఉండేదని ఇప్పుడు 5వేల కిటోమీటర్లకు హైవే పెంచినట్లు మోదీ తెలిపారు. ఇందుకు 35వేల కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు.

తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పాటుపడిందని అన్నారు ప్రధాని మోదీ. శుక్రవారం రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన... సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మాట్లాడారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే మంత్రాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో దేశంలో చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆ అభివృద్ధిలో తెలంగాణ కూడా భాగమైందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా నగరాలు అభివృద్ది చెందాయని, రోడ్లు నిర్మాణమయ్యాయని అన్నారు. హైదరాబాద్ లో డెబ్బై కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ తో పాటు, మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్, ఎమ్ ఎమ్ టీఎస్ పనులను కూడా వేగవంతంగా అభివృద్ది చేసినట్లు తెలిపారు. ఈ రోజు కూడా 13 ఎమ్ ఎమ్ టీఎస్ సర్వీసులను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. దీంతో కొత్త బిజినెస్ హబ్ లు వస్తాయని అన్నారు.

కరోనా ప్యాండమిక్ లో ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయని మోదీ అన్నారు. అలాంటి పరిస్థితిలో భారత్ సమర్థంగా నిలబడిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10లక్షల కోట్ల రూపాయలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కెటాయించినట్లు చెప్పారు. 21శతాబ్థపు భారత్, దేశంలోని అన్ని ప్రాంతాల్లో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణలోని రైల్వేను 17రేట్లు అభివృద్ది చేసినట్లు మోదీ చెప్పారు. సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్యలో రైల్వే డబ్లింగ్ పనులు వేగంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దీంతో హైదరాబాద్ బెంగళూరు కనెక్టివిటీ డెవలప్ అయినట్లు చెప్పారు. రైల్వే ప్రాజెక్టులతో పాటు హైవేలను కూడా డెవలప్ చేసినట్లు తెలిపారు.

2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల హైవే ఉండేదని ఇప్పుడు 5వేల కిటోమీటర్లకు హైవే పెంచినట్లు మోదీ తెలిపారు. తెలంగాణలో హైవేలను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం 35వేల కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇప్పటికీ... మరో 60 వేల కోట్లతో రోడ్లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ అందులో భాగమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తెలంగాణలో ఇండస్ట్రీ, రైతాంగం రెండింటి అభివృద్దిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం నాలుగు మెగా టెక్సటైల్స్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు అందులో ఒకటి తెలంగాణకు కెటాయించినట్లు తెలిపారు.

Next Story