Telangana BJP: కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయం: ప్రధాని మోదీ

Telangana BJP: కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయం: ప్రధాని మోదీ
X
ప్రజల నమ్మకాన్ని కేసీఆర్‌ సర్కార్‌ వమ్ముచేసిందని మండిపడ్డారు.


వరంగల్‌ సభలో కేసీఆర్‌ ప్రభుత్వంపై డైరెక్ట్ అటాక్‌ చేశారు ప్రధాని మోదీ. కేసీఆర్‌ సర్కార్‌ అత్యంత అవినీతిమయమంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురి పెట్టాయన్నారు. స్కామ్‌ల నుంచి దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ కొత్త నాటాకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి ఢిల్లీకి వరకు పాకిందన్న ప్రధాని.. కేంద్రాన్ని విమర్శించడమే కేసీఆర్‌ సర్కార్‌ పని అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతిపాలనను దేశమంతా చూసిందని ఇప్పుడు..కేసీఆర్‌ అవినీతిపాలనను తెలంగాణ చూసిందన్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్‌ సర్కార్‌ వమ్ముచేసిందని మండిపడ్డారు.

తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని.. వరంగల్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటేనని.. ఆ పార్టీల అడ్రస్‌ గల్లంతు చేస్తామన్నారు. తెలంగాణకు 9 ఏళ్లలో ఎన్నో నిధులిచ్చామని తెలిపారు. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని.. అయితే ఈ ప్రభుత్వం అత్యంత అవినీతిమయంగా మారిందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి లేని ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని.. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు.

Tags

Next Story