భారత్ బయోటెక్‌లో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ టూర్ కొనసాగుతోంది. హకీంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్ బయోటెక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై చర్చిస్తున్నారు. కోవాగ్జిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుంటున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో జీనోమ్ వ్యాలీలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులను మాత్రమే పీఎంవో అనుమతిచ్చింది. హైదరాబాద్ పర్యటన అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించనున్నారు మోదీ. అక్కడ కూడా వ్యాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు.
అంతకు ముందు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్లిన ప్రధాని.. జైడస్ క్యాడిలా కర్మాగారాన్ని సందర్శించారు. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్-డి టీకా ప్రయోగాలను మోదీ పరిశీలించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక భారత్ బయోటెక్ లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. త్వరలో కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచానికి భారత్ అందించబోతుందని ఇప్పటికే మోదీ ప్రకటించారు. ఈ తరుణంలో ప్రధాని వ్యాక్సిన్ టూర్ ఆసక్తి రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com