Narendra Modi : బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. శభాష్ అంటూ

Narendra Modi : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అభినందించారు ప్రధాని మోదీ. బండి సంజయ్‌కు ఫోన్ చేసిన మోదీ.. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారంటూ అభినందించారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్‌పైనా ఆరా తీశారు. పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టానని మోదీకి తెలిపారు బండి సంజయ్. రెండు విడతల్లో కలిపి 770 కిలోమీటర్లు నడిచానన్నారు. నడిచింది నేనయినా.. నడిపించింది మీరేనని.. మీరు చెప్పిన ''సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్'' పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని మోదీకి వివరించారు బండి సంజయ్.
ఇక పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారని బండి సంజయ్‌ను ప్రధాని మోదీ ఆరా తీశారు. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటూ బండి సంజయ్ వివరించారు. కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. పాదయాత్రలో కేంద్రం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తుండటంతో కేసీఆర్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. తెలంగాణలోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మోదీతో అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చానని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని అన్నారు బండి సంజయ్.
రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సూచనలు సత్ఫలితాలు ఇచ్చాయని మోదీకి వివరించారు బండి సంజయ్. మీ స్ఫూర్తితో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి కాల్‌తో కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు బండి సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com