PM Modi: తెలంగాణకు విచ్చేయనున్న ప్రధాని

PM Modi: తెలంగాణకు విచ్చేయనున్న ప్రధాని
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. వచ్చేనెల 8న రాష్ట్రానికి వస్తారు. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు

ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. వచ్చేనెల 8న రాష్ట్రానికి వస్తారు. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. రాష్ట్రంలో అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్రమంత్రులు వరుస పర్యటనలు చేస్తున్నారు. సభలు, సమావేశాలతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు.

అటు.. వచ్చేనెల 8వ తేదీనే 11 రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులతో పాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో హైదరాబాద్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అమిత్‌షా, జేపీ నడ్డాతో పాటు ప్రధాని మోదీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై బీజేపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నేతల సమావేశం అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సభకు ప్రధాని మోదీ హాజరైతే ఇంపాక్ట్‌ ఎక్కువగా ఉంటుందని.. శ్రేణుల్లోనూ జోష్‌ వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story