12 Nov 2022 6:10 AM GMT

Home
 / 
తెలంగాణ / PM Modi: కాసేపట్లో...

PM Modi: కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్‌కు..

PM Modi: కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12.25కు విశాఖ నుంచి హైదరాబాద్‌ కు రానున్నారు..

PM Modi: కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్‌కు..
X

PM Modi: కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12.25కు విశాఖ నుంచి హైదరాబాద్‌ కు రానున్నారు.. ఒకటిన్నరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్‌పోర్ట్‌లో పబ్లిక్‌ మీటింగ్‌కు హాజరవుతారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.


మధ్యాహ్నాం 2.15కు బేగంపేట నుంచి రామగుండం బయల్దేరతారు. 3.20కు రామగుండం హెలీప్యాడ్‌కు చేరుకుని.. రోడ్డు మార్గం ద్వారా ఫ్యాక్టరీ వద్దకు వెళతారు. సాయంత్రం 4.15కు కార్యక్రమం జరిగే ప్రాంతానికి రానున్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే ఎరువుల తయారీ పరిశ్రమను ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు ప‌్రధాని మోదీ.


ఇక ప్రధాని మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పొటికల్ హీట్ పెరిగింది. బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి, కార్మిక సంఘాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రధాని పర్యటనను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకే అండ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనకుండా కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శల బాణం ఎక్కుపెడుతున్నారు.


ప్రధాని మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో బ్యానర్ల కలకలం రేపుతుంది. పర్యటనకు ముందే మోదీకి నిరసన సెగ తగిలింది. మోదీకి వ్యతిరేకంగా రామగుండంలో బ్యానర్లు వెలిశాయి. మోదీని రావణాసూరుడితో పోల్చుతూ బ్యానర్లు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. రావాణసూరిడి రూపంలో మోదీ బ్యానర్ ను పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ ప్రధాని అయ్యాక తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణకు ITIR ఏమైయ్యిందన్నారు. మిషన్ భగీరథకు నిధులు, టెక్స్ టైల్ పార్కు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఏమైనయని ప్రశ్నల వర్షం కురింపించారు.


మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో నిరసన తెలిపేందుకు గోదావరి ఖనికి వెళ్లిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూనంనేనిని మంచిర్యాల జిల్లా జైపూర్ పీఎస్ కు తీసుకెళ్లారు. పోలీసుల తీరుకు నిరసన స్టేషన్ లోనే సాంబశివరావు దీక్షకు దిగారు.అప్రజాస్వామికంగా తమను అరెస్టు చేశారని మండిపడ్డారు. నిసన తెలియజేయడం పౌరుల ప్రజా స్వామిక హక్కు అని దాన్ని కూడా ఖూనీ చేయడం దుర్మార్గమన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ, ప్రజా సంఘాల నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇక అరెస్టు చేసిన వారందరినీ వెంటనే భేషరతుగా తమను విడుదల చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.


ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ దూరంగా ఉండనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు వీడ్కోలు కార్యక్రమంలోనూ తలసానే పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Next Story