Pochampalle: పోచంపల్లి గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. కేటీఆర్ ప్రశంసలు..

Pochampalle (tv5news.in)

Pochampalle (tv5news.in)

Pochampalle: పోచంపల్లి గ్రామాన్ని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ గుర్తించింది.

Pochampalle: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పోచంపల్లి గ్రామాన్ని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ గుర్తించింది. ప్రతిదేశంలో మూడు పర్యాటక గ్రామాల కోసం ఈసంస్థ నామినేషన్లను స్వీకరించింది.

ఉత్తర భారతదేశానికి రెండు గ్రామాలు.. దక్షిణ భారతదేశం నుంచి చేనేతకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన పోచంపల్లి అర్హత సాధించింది. డిసెంబర్‌ 2 వతేదిన.. స్పెయిన్‌లో జరిగే ఆర్గనైజేషన్‌ జనరల్‌ అసెంబ్లీ లో అవార్డును అందించనున్నారు. మరోవైపు పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడం పట్ల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags

Next Story