ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

ప్రజాగాయకుడు, యుద్దనౌక గద్దర్ కన్ను ముశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యే హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు గద్దర్ కుమారుడు సత్యం తెలిపారు. 1949 జూన్ 5న తూఫ్రాన్ లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.
తెలంగాణ ఉద్యమంతో పాటు పలు నేపథ్యాలలో తన పాటలతో ఎంతో కీలకపాత్ర పోషించారు. పాటే ఆయుధంగా పాలకులపై ఎక్కుపెట్టిన ప్రజా భాణం గద్దర్. ఈ మధ్యే గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన... అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. గద్దర్ మృతి పట్ల రాజకీయ నాయకులు, కవులు, సంతాపం ప్రకటించారు. రేపు ఆయన అంత్యక్రియలు జరుగనున్నట్లు సమాచారం.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఎంతోమంది యువతను తట్టిలేపారు. ఆయన మృతిపట్ల సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారం క్రితమే ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com