Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్..

Revanth Reddy: రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసొం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయాలన్న డిమాండ్‌తో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల ముందు ధర్నాకు తెలంగాణ పీసీసీ పిలుపు ఇచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్టు చేశారు. ఆయన నివాసం ముందు బారికేడ్లు పెట్టి.. పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ ధర్నా చేయనున్నట్లు సమాచారం రావడంతో అయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అటు.. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని సైతం పోలీసులు హౌజ్ అరెస్టుచేశారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇళ్లనుంచి బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టంచేశారు. రాహుల్ గాంధీపై అసొం సీఎం హిమంత బిశ్మశర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్టేషన్లలో ఇప్పటికే అసోం సీఎంపై ఫిర్యాదులు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com