Police Command Control Centre: ప్రారంభానికి సిద్ధమైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..

Police Command Control Centre: ప్రారంభానికి సిద్ధమైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..
X
Police Command Control Centre: బంజారాహిల్స్‌లో ఏర్పాటు అయ్యింది ఇంటెగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.

Police Command Control Centre: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటెగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఇప్పటికే అధికారులు డ్రై రన్‌ కూడా నిర్వహించారు. రేపు సీఎం రానుండటంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లో పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. అటుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు.

Tags

Next Story