TS: రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పోలీసు జంట ఆదర్శ వివాహం చేసుకుంది. బీరవల్లి ప్రశాంత్, నాగజ్యోతిలకు రాజ్యాంగంపై ప్రమాణం చేయించి వివాహతంతును నిర్వహించారు. అంబేద్కర్ ఫోటో కి పూలదండ వేయించి మతాలకు, సాంప్రదాయాలకు అతీతంగా వధూవరులకు దండలు మార్పించి నిరాడంబరంగా స్టేజ్ వివాహం జరిపించారు. వరుడు బీరవల్లి ప్రశాంత్ జార్ఖండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండగా, వధువు నాగజ్యోతి విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ఆదర్శ వివాహానికి సిద్ధపడటం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న బీరవల్లి ప్రశాంత్, నాగజ్యోతిల బంధుమిత్రులు, గ్రామస్తులు ఆశీర్వదించారు.
అంబేద్కర్ ఫోటో సాక్షిగా..
పోలీస్ శాఖలో పనిచేస్తున్న బీరవల్లి ప్రశాంత్, నాగ జ్యోతి వివాహం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. పెళ్లి వేదిక పై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భావజాలం కలిగిన పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి తంతు ముగించారు. నూతన వధూవరులిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామని ప్రమాణం చేస్తూ రాజ్యాంగం బుక్ సాక్షిగా భార్య భర్తలయ్యారు. భారత రాజ్యాంగం బుక్ పై ప్రమాణం చేయించి, అంబేద్కర్ ఫోటో సాక్షిగా పూలమాలలు మార్చుకుని, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆదర్శ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com