సంచలనం రేపిన బంగారం చోరీ కేసులో నిందితుల అరెస్టు!

సంచలనం రేపిన బంగారం చోరీ కేసులో నిందితుల అరెస్టు!
మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో ఈనెల 18వ తేదీన చోరీ జరిగింది. తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా దొంగలు 70తులాల బంగారం చోరీ చేసి పారిపోయారు.

మహబూబునగర్ జిల్లాలో సంచలనం రేపిన బంగారం చోరీ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో ఈనెల 18వ తేదీన చోరీ జరిగింది. తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా దొంగలు 70తులాల బంగారం చోరీ చేసి పారిపోయారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 12 రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.

చోరీ జరిగిన స్థలంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంగడి సురేష్, దాసరి మురళి, బొల్లంపల్లి వీరయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు బిజిలి మల్లయ్య పరారీలో ఉన్నాడు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను తక్కువ సమయంలో పట్టుకుని వారి వద్ద నుంచి 61 తులాల బంగారం, రెండు లక్షల 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రెమో రాజేశ్వరి తెలిపారు.

Tags

Next Story