Lockdown in Telangana : ఆంక్షలు కఠినతరం.. బయటకు వస్తే బండి సీజ్..!
X
By - TV5 Digital Team |20 May 2021 2:44 PM IST
Lockdown in Telangana : తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినతరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.
Lockdown in Telangana : తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినతరం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి అనవసరంగా వచ్చిన వాహనాలు సీజ్ చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పలుచోట్ల వాహనదారులు లాక్ డౌన్ ను లెక్క చేయడంలేదు హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అనుమతులు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ పాసులు ఉన్నవారిని మాత్రమే.. పంపిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లాక్ డోన్ ఆంక్షలు కఠినతరం చేశారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com