Old City : పోలీసుల నిఘాలో పాత బస్తీ.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్..

Old City : హైదరాబాద్‌లో పాతబస్తీలో ఆంక్షలు మొదలైయ్యాయి. మరి కొన్ని రోజుల పాటు ఆంక్షలు పొడిగించే అవకాశం ఉంది. సౌత్‌జోన్,ఈస్ట్‌జోన్ బేగంబజార్ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. ఇప్పటికే పాతబస్తి వైపు వచ్చే వాహానాలు దారి మళ్లించారు.చార్మినార్.శాలిబండ మొఘల్‌పురాలో మొత్తం మూయించేశారు పోలీసులు.ఇప్పటికే ఓల్డ్‌సిటీలో షాపులు,పెట్రోల్ పంపులు,హోటళ్లు కూడా మూతపడ్డాయి.కొద్దిరోజుల పాటు రాత్రి ఏడు గంటల తరువాత షాపులు మూసివేయాలని పోలీస్ అధికారులు సూచించారు. మరోవైపు పాతబస్తీపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు నిఘా పెట్టాయి.మరోవైపు రోడ్ల పైన నిరసనలు చేస్తే కఠినచర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
హైదరాబాద్ పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్లలో దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఓల్డ్‌సిటీలో షాపులు,పెట్రోల్ పంపులు,హోటళ్లు కూడా మూతపడ్డాయి. కొద్దిరోజుల పాటు రాత్రి ఏడు గంటల తరువాత షాపులు మూసివేయాలని పోలీస్ అధికారులు సూచించారు. మరోవైపు పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు భారీగా మోహరించాయి. పుకార్లను నమ్మొద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని అంటున్నారు సౌత్‌జోన్ డీసీపీ ఆనంద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com