BRS: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు

BRS: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
X

ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు, కేసినో నిర్వహించిన కేసు బీఆర్‌ఎస్‌ను వెంటాడుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాల నిర్వహణ కేసులో ఇప్పటికే ఆయనకు ఓసారి నోటీసులు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని తాజాగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. అయినా పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఈఫామ్‌హౌస్‌లో సకల సౌకర్యాలతో కోడిపందేలు నిర్వహించారు.


Tags

Next Story