Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీసుల ప్రశ్నల వర్షం

Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీసుల ప్రశ్నల వర్షం
X

డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్‌ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది. మంగళవారం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు అల్లు అర్జున్. 2 గంటల పాటు 50 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.

Tags

Next Story