TSPSC పేపర్ లీకేజి కేసులో రాజకీయ నేతల కుమారులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజి కేసు మరో కీలక మలుపు తిరిగింది. TSPSC కేసులో రాజకీయ నేతల కుమారుల పేర్లు బయటపడుతున్నాయి. AEE ఉద్యోగం ఇప్పిస్తానని డీఈ రమేష్ 75 లక్షలకు బేరం పెట్టాడని తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో ఆయన ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ కుమార్తె AEE పరీక్ష రాసింది..పరీక్షకు నెల రోజుల ముందు..మాజీ ఎంపీటీసీ మద్దెల శ్రీనివాస్‌ను డీఈఈ రమేష్ కలిశాడు. ఆమెకు రమేష్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఉద్యోగం ఇచ్చిన తర్వాతనే డబ్బులు చెల్లిస్తానని ప్రజాప్రతినిధి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
రెండున్నర నెలలుగా జరుగుతున్న దర్యాప్తులో ఇప్పటి వరకు 50 మందిని అరెస్టు చేశారు. మరికొన్ని రోజుల్లో ఇంకొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు డీఈఈ రమేశ్ ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఉండవచ్చని సమాచారం. కొద్దిరోజుల క్రితం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వారితో సంబంధం లేకుండా మాస్‌కాపీయింగ్ చేయించిన విద్యుత్తుశాఖ డీఈఈ రమేశ్ ముఠాను సిట్ అధికారులు గుర్తించారు.
ఏఈఈ, డీఏవో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన ఓ కాలేజ్ ప్రిన్సిపల్‌తో రమేశ్ ఒప్పందం కుదుర్చుకొని ఓ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని మాస్‌కాపీయింగ్ చేయించాడని,దీంతో పాటు ఏఈఈ పేపర్‌ను మరో 30 మందికి అమ్ముకున్నట్లు తేలింది.రమేశ్, సురేష్‌ల వాంగ్మూలాలు నమోదు తర్వాత ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com