Munugode: మునుగోడు.. గేరు మారుస్తున్న రాజకీయ పార్టీలు..

Munugode: మునుగోడు ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు గేర్ మారుస్తున్నాయి. దసరా సెలవులు ముగియడంతో ఇక మునుగోడుపై ఫోకస్ పెట్టారు. బైపోల్ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో.. బండి సంజయ్ అధ్యక్షతన ముఖ్య నేతలతో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్‌తో పాటు సహ ఇన్‌ఛార్జ్ అర్వింద్ మీనన్ కూడా హాజరయ్యారు. ఇవాళ్టి మీటింగ్‌లో మునుగోడు ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, సర్వే రిపోర్ట్‌లపైనా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.
అలాగే మునుగోడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డే అయినప్పటికీ.. ఇప్పటి వరకు పార్టీ తరపున అధికారికంగా ప్రకటించలేదు. ఆ లాంఛనం ఇవాళ పూర్తి చేశారు. ఈ సమావేశం తరువాత మధ్యాహ్నం.. జిల్లా, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో బండి సంజయ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు సమావేశం కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com