CAMPAIGN: పతాకస్థాయికి ప్రచారం

CAMPAIGN: పతాకస్థాయికి ప్రచారం
ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న అభ్యర్థులు.... సుడిగాలి పర్యటనలు చేస్తున్న నేతలు

అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాల జోరు కొనసాగుతోంది. సమయం దగ్గర పడుతుండంతో మెనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరిస్తూ.. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఊరూవాడ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో MIM అధినేత అసదుద్ధిన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్వాన్ నియోజకవర్గ MIM అభ్యర్థి కౌసర్ మొయినుద్దీన్ ప్రచారం ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ప్రచారం చేసిన స్థానిక MLA మహేష్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థులను కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నాలుగేళ్లలో పేద ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమంటూ.. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయరెడ్డి ప్రచారం నిర్వహించారు.


ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డికి మద్దతుగా.. గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ షేట్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం వేగవంతం చేశారు. రంగారెడి జిల్లా యాచారంలో ప్రచారం నిర్వహించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రెండవ బొగ్గు గని ఆవరణలో ఉన్న కార్మికులను కలిసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోరుకంటి చందర్.. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాఘవపూర్‌లో బీఅర్ఎస్‌ అభ్యర్థి మనోహర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా గంగాధరలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం విస్తృతంగా ప్రచారం చేశారు.


హుజూరాబాద్‌లో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్‌ అభ్యర్థి వొడితల ప్రణవ్‌కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కాజీపేట-2 గనిలో ప్రచారం నిర్వహించిన చెన్నూరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్ కేసీఆర్ పాలనే సింగరేణికి శ్రీరామరక్ష అన్నారు. మందమర్రిలో కేసీఆర్‌ను ఓడించాలంటూ ఉస్మానియా విద్యార్థులు ప్రచారం చేపట్టారు. వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్.. వాకర్స్‌ను కలిసి ఓటు వేలాంటూ ప్రచారం నిర్వహించారు. నిర్మల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధిని చూసి..ఆదరించాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.


ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సత్తుపల్లిలో ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య.. అధికారంలోకి వస్తే జనవరి నాటికి దళితబంధు పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పాలేరులో ప్రచారం నిర్వహించిన కందాల ఉపేందర్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రచారం నిర్వహించిన.. జైవీర్ కాంగ్రెస్‌ హామీలనే బీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందన్నారు. తుంగతుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. సూర్యపేట బీజేపీ అభ్యర్థి శ్రీలతరెడ్డి కమలం పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు..

Tags

Read MoreRead Less
Next Story