KCR National Party : కేసీఆర్ జాతీయ పార్టీ పై నాయకులు ఏమన్నారంటే..

KCR National Party : కేసీఆర్ జాతీయ పార్టీ పై నాయకులు ఏమన్నారంటే..
KCR National Party : జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది

KCR National Party : జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాతే ఫ్రంట్‌లు, పొత్తులపై వివిధ నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. ఈ నెల 11న జేడీయూ లీడర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం.

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనేది దేశ ప్రజల ఆకాంక్ష అన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. మోదీ సర్కార్ వైషమ్యాలు రెచ్చగొట్టి దేశం పరువు తీసేలా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి రావాల్సిందేనన్నారు టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షులు. ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. దేశం కోసం సీఎం కేసీఆర్‌ మరో ఉద్యమం చేపట్టాలని కోరారు. బీజేపీ ముక్త్‌ భారత్‌ దిశగా తామంతా ముఖ్యమంత్రి వెంట నడుస్తామన్నారు

బీజేపీ ముక్త్‌ భారత్‌ కావాలంటే కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టాలన్నారు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి. మోదీ పాలనలో దేశంలోని ఏ వర్గానికి మేలు జరుగుతలేదన్నారు. రైతులు రాజులుగా మారాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎంట్రీపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ మళ్లీ BRS అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడడం కేసీఆర్‌కు కొత్తేమి కాదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను ఇంటింకి పంపడం ఖాయమన్నారు.

ఇప్పటికే జాతీయ రాజకీయాలపై స్పీడ్ పెంచిన కేసీఆర్‌...వివిధ పార్టీల అధినేతలు, రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. పార్టీ ఏర్పాటు తర్వాతే పొత్తులు, ఫ్రంట్‌లపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story