తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్...!

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్...!
X
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులతోపాటు.. స్వతంత్ర అభ్యర్ధులు సైతం గట్టిపోటి ఇచ్చినట్లు తెలిసింది.

తెలంగాణాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులతోపాటు.. స్వతంత్ర అభ్యర్ధులు సైతం గట్టి పోటీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సమయం ముగియడంతో క్యూలైన్లో ఉన్నవారికి మాత్రం ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 93 మంది పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10 లక్షలకు పైగా ఓటర్లున్నారు. కాగా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారాన్ని కూడా భారీ స్థాయిలో నిర్వహించాయి.

Tags

Next Story