Poultry farming: రూ.లక్షతో కోళ్ల పెంపకం.. రెండేళ్లలో రూ.15 లక్షల ఆదాయం..

Poultry farming: రూ.లక్షతో కోళ్ల పెంపకం.. రెండేళ్లలో రూ.15 లక్షల ఆదాయం..
X
Poultry farming: రెండేళ్ల క్రితం లక్ష రూపాయలు వెచ్చించి నాలుగు నాటు కోడి పెట్టలు, ఒక జాతి పుంజు కోనుగోలు చేశారు.

Poultry farming: ఉన్నత చదువులు చదివారు.. ఉద్యోగాలు చేద్దామనుకున్నారు.. ఎవరికిందో పని చేసి.. ఏదో సంపాదిస్తున్నాం అని తృప్తి పడితే సరిపోతుందా అని ఒకటికి పది సార్లు ఆలోచించి చివరకు కోళ్ల పెంపకం ప్రారంభించారు ఎంబీఏ, బీటెక్ చదువుకున్న యువకులు.

రెండేళ్ల క్రితం లక్ష రూపాయలు వెచ్చించి నాలుగు నాటు కోడి పెట్టలు, ఒక జాతి పుంజు కోనుగోలు చేశారు. వాటితో క్రాసింగ్ చేయగా గుడ్లు పెట్టాయి. వాటిని పొదిగించి పిల్లలు చేస్తున్నారు. గుడ్లను ఒక్కొక్కటి రూ.500, కోడి పిల్ల వెయ్యి రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం వారి వద్ద 5 పుంజులు, 50 పెట్టలు, 50 పిల్లలు ఉన్నాయి. వచ్చే ఆదాయంతో మరిన్ని కోళ్లు కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. 1200 పిల్లలను విక్రయించగా రూ.10 లక్షల లాభం రావడంతో తాము చేపట్టిన వ్యాపారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో పుంజు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలకు విక్రయిస్తుండగా, ఒక్కో పెట్ట రూ.20 నుంచి రూ.50 వేల మధ్య ధర పలుకుతోందని అన్నారు. ఇకపోతే కోళ్లకు మేతకోసం నెలకు రూ.15 వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

వీటికి ఆహారంగా రాగులు, సజ్జలు, గంట్లు, అంజీరా, బాదం, కిస్‌మిస్‌తో పాటు ఉడికించిన గుడ్లను కూడా వేస్తారట. పౌల్ట్రీ వ్యాపారంలో వచ్చిన లాభంతో మరికొన్ని కోళ్లు కోనుగోళ్లు చేసిన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ముగ్గురు యువకులు తమ సక్సెస్ స్టోరీని వివరించారు.

Tags

Next Story