Telangana: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ మధ్య పవర్‌ వార్‌

Telangana: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ మధ్య పవర్‌ వార్‌
ఆందోళనలకు బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపునిచ్చారు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ మధ్య పవర్‌ వార్‌ ముదిరింది. ఉచిత విద్యుత్‌పై పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు.

ఈ నిరసనల్లో రైతుల్ని పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని కేటీఆర్ సూచించారు. దీంతో.. పోటాపోటీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పొలిటికల్ అడ్వాంటేజ్‌గా తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌పై ఎదురుదాడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతులకు కరెంటు కష్టాలు తప్పవంటూ ప్రచారం చేస్తోంది.

అటు.. తెలంగాణ రైతాంగంపై ఎందుకంత అక్కసంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. రాహుల్‌ గాంధీ గారూ.. తెలంగాణ రైతాంగంపై ఎందుకు కక్ష కట్టారంటూ ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాపై కాంగ్రెస్‌కు వచ్చిన సమస్యేంటన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేకపోతున్నారన్న కారణంతో.. తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

Tags

Next Story