ఈ ఏడాది నుంచి ఇంగ్లీషులోనూ ప్రాక్టికల్స్..

ఈ ఏడాది నుంచి ఇంగ్లీషులోనూ ప్రాక్టికల్స్..
ప్రాక్టికల్స్ అంటే సైన్స్ సబ్జెక్ కు మాత్రమే ఉండేవి ఇంతకు ముందు వరకు.

ప్రాక్టికల్స్ అంటే సైన్స్ సబ్జెక్ కు మాత్రమే ఉండేవి ఇంతకు ముందు వరకు. కానీ ఈ ఏడాది నుంచి ఇంగ్లీషులోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఆంగ్లంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు వీటిని అమలు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్స్ కు 20 మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.

మరోవైపు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. జూన్ 30 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో సెక్షన్ లో 88 మంది విద్యార్ధులకు మించి ఉండకూడదని రూల్స్ పాస్ చేసింది. అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు పెడితే కళాశాల అనుమతి రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

Tags

Next Story