KCR: ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ..

KCR: ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ..
KCR: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ మరింత పెంచారు..

KCR: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ మరింత పెంచారు.. ఇప్పటికే రాష్ట్రాల పర్యటనను పూర్తిచేసిన కేసీఆర్‌.. జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, సీఎం కేసీఆర్‌ భేటీ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.. హైదరాబాద్‌ వచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌ ప్రగతి భవన్‌ వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.. దాదాపు మూడు గంటలపాటు ఇద్దరూ చర్చించారు..

జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటుతోపాటు.. ముందస్తు ఎన్నికలు, సర్వేలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి హరీష్‌రావు కూడా హాజరయ్యారు.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారు.. టీఆర్‌ఎస్‌ పార్టీని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలనే అంశంపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి.. ఇటీవలే ప్రగతి భవన్‌లో జరిగిన ప్రజాప్రతినిధుల భేటీలోనూ దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం.. అటు చూస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం కోసం విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్‌ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సమయంలో కేసీఆర్‌, పీకే సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలను అవలంబించాలనే దానిపైనా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్ది సేపటి క్రితమే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కూడా సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.. వీరి మధ్య కూడా జాతీయ రాజకీయాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది..

Tags

Read MoreRead Less
Next Story