priest dies in kandlakoya hanuman temple: పూజ చేసి ప్రసాదం ఇస్తూ కుప్పకూలిన పూజారి..

priest dies in kandlakoya hanuman temple:
priest dies in kandlakoya hanuman temple: హనుమంతుడికి పూజ చేసి హారతి ఇస్తూ దేవుని చరణాల వద్దే కుప్పకూలిపోయారు మేడ్చల్‌కు చెందిన పూజారి. ఆంజనేయస్వామికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం రోజున ఆలయంలో పూజ నిర్వహిస్తున్న ఓ పూజారి కుప్పకూలిపోయారు. కండ్లకోయ హనుమాన్ దేవాలయంలో శేష మణి అనే పూజారి ఉదయం 6 గంటల సమయంలో పూజ చేసి భక్తులకు ప్రసాదం ఇస్తూ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే భక్తులు అప్రమత్తమై 108కి సమాచారం అందించారు. అంబులెన్స్‌లో పూజారిని హాస్పిటల్‌కు తరలించారు. కానీ పూజారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు షాకయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com