Nirmal: నిద్రమత్తులో డ్రైవర్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Nirmal (tv5news.in)
By - Divya Reddy |3 Nov 2021 7:15 AM GMT
Nirmal: డ్రైవర్ నిద్రమత్తుతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు.
Nirmal: డ్రైవర్ నిద్రమత్తుతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ బైపాస్ రోడ్డు వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి యూపీకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. మార్గమధ్యలో ఒక్కసారిగా రోడ్డు పక్కన బోల్తా పడింది. అయితే.. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా యూపీకి చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు. దీపావళి సందర్భంగా సొంతూర్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com