TPCC: కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాల

TPCC: కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాల
టికెట్లు దక్కకపోవడంతో నేతల ఆందోళనలు... భవిష్యత్తు కార్యచరణకు సిద్ధమవుతున్న హస్తం పార్టీ నాయకులు

రెండో జాబితాలో టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకత్వంపై తిరుగుబాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటనకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తామని కొందరు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తామని మరికొందరు తేల్చిచెబుతున్నారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తమను కాదని.. ఇతరులకు టికెట్లు ఇవ్వడమేంటని సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.


మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వగాచలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. అనుచరులతో సమావేశమైన వారు... త్వరలోనే తమ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ టికెట్ వస్తుందని ఆశించిన PJR కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అజారుద్దీన్ కు ఇవ్వడంతో నేడు కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. ఆయన అనుచరులు కొందరు గాంధీభవన్ కు వెళ్లి ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టికెట్ పొన్నం ప్రభాకర్ కు ఇవ్వగా మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, జడ్చర్లకు చెందిన M చంద్రశేఖర్ నవంబర్ 9న స్వతంత్రంగా నామినేషన్ వేస్తానని చెప్పారు. మైనార్టీ విభాగం ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ , కూకట్ పల్లి టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగళరావు. పార్టీకి రాజీనామా చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం టికెట్ మదన్మోహన్ కు దక్కడంతో ఆ టికెట్ ఆశించిన నియోజకవర్గం ఇన్ ఛార్జి సుభాష్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎల్లారెడ్డిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. బోరుమన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సుభాష్ రెడ్డి కామారెడ్డిలో స్వతంత్ర్యంగా పోటీ చేస్తానని చెప్పారు.


ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. జడ్చర్ల, నారాయణపేట నియోజకవర్గాల నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా బరిలో ఉంటానని ప్రకటించారు. దేవరకద్రలో మధుసూదన్‌రెడ్డిని మార్చాలని లేదంటే పార్టీ నష్టపోవాల్సి వస్తుందని అక్కడి నేతలు అధిష్టానానికి సందేశాలు పంపారు. మధుసూదన్ రెడ్డి గెలుపు TPCC: కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాలకోసం శ్రమించేందుకు శ్రేణులు సిద్ధంగా లేరని ఇప్పటికైనా అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేశారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తూడి మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చివరి వరకూ ఆయనకే టిక్కెట్ వస్తుందని అంతా ఆశించినా.... ఆఖరి నిమిషంలో చిన్నారెడ్డి పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీలో చేరడంపై కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌ను బలోపేతం చేసి, పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story