WARNGAL: కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం

తెలంగాణలో ర్యాగింగ్ మరోసారి కలకలం రేపింది. వరంగల్‌లోని ప్రతిష్ఠాత్మక కాకతీయ వైద్యకాలేజీలో ర్యాంగింగ్ కలకలం రేపింది. వరంగల్ కాకతీయ వైద్యకళాశాలలో ఈనెల14న ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. రాజస్ధాన్‌కి చెందిన మొదటి సంవత్సరం విద్యార్ధి గ్రంధాలయం నుంచి హాస్టల్‌కు వెళుతుండగా మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పగా అందుకు అతను నిరాకరించడంతో గొడవ మెుదలైంది. ఆగ్రహం పట్టలేక సీనియర్ విద్యార్ధి స్నేహితులతో కలిసి మూకుమ్మడి దాడి చేయించడంతో జూనియర్ విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆ విద్యార్ధికి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. జరిగిన ఘటనపై బాధిత విద్యార్ధి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాలలో విచారణ చేశారు. ఏడుగురిపై ర్యాగింగ్ చట్టంతో పాటు 294/ బి 323, 240 సెక్షన్ కింద కేసులు నమోదుచేశారు. కళాశాలలో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆ ఘటనకు బాధ్యులుగా భావించిన ఏడుగురు సీనియర్ వైద్యవిద్యార్ధులపై మూడు నెలల సస్పెన్షన్ వేటు పడింది. ఏడాదిపాటు విద్యార్ధులకు హాస్టళ్లలో వసతిని తొలగించారు. ప్రఖ్యాత KMCలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణలు తెలెత్తుతూ ర్యాగింగ్‌కు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి..
కాకతీయ వైద్యకాలేజీ హాస్టళ్ల వద్ద రాత్రిపూట ఏంజరుగుతోందో అధికారులకి తెలియక విద్యార్ధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల ఆవరణలో పుట్టిన రోజు వేడుకలపై నిషేధం ఉన్నా నియంత్రించే వారే ఉండట్లేదు. దాదాపు వెయ్యిమంది జూనియర్, సీనియర్ వైద్య విద్యార్ధుల హాస్టళ్లు పక్కపక్కనే ఉంటాయి. రాత్రి సమయంలో ఒకరికొకరు తారసపడే క్రమంలో గొడవకు దారితీయడం, ర్యాగింగ్‌కు పాల్పడటం జరుగుతోంది. గతంలో సీనియర్ వేధింపులతో వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలంసృష్టించింది. అంతకుముందు ఓ కేంద్రమంత్రి కుటుంబానికి చెందిన విద్యార్ధిని ర్యాగింగ్ చేయగా 15 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారే తప్ప ఉన్నతాధికారులు దీర్ఘకాలిక చర్యలు చేపట్టడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com