Rahul Gandhi: తెలంగాణ ప్రజలు, సోనియా కన్న కలలను కేసీఆర్ నాశనం చేశారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండ్రోజుల తెలంగాణ టూర్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. వచ్చే ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన రాహుల్... కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమన్నారు. తెలంగాణ టూర్ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియా వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రజలు, సోనియా కన్న కలలను కేసీఆర్ నాశనం చేశారంటూ ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్‌ను ఓడించి ఉజ్వల తెలంగాణను నిర్మించడమే లక్ష్యమన్నారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలను విశ్వసించే యువత.. తమతో కలిసి రావడాన్ని స్వాగతిస్తామంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కేసీఆర్ సర్కార్‌కే కాదు.. సొంత పార్టీ నేతలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు రాహుల్.. జనాల్లో ఉన్నోళ్లకే టికెట్లిస్తామని మరోసారి తేల్చి చెప్పారు. లీడర్లంతా హైదరాబాద్ వీడి, ఊళ్ల బాట పట్టాలన్నారు. ఢిల్లీ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక మీడియాతో ఏది పడితే అది మాట్లాడొద్దంటూ అల్టిమేటమ్ ఇచ్చారు రాహుల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com