Rahul Jodo Yatra: ఈనెల 23న తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర..

Rahul Jodo Yatra: ఈనెల 23న తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర..
X
Rahul Jodo Yatra: తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ భారత్ జోడో యాత్ర జరగనుంది

Rahul Jodo Yatra: హైదరాబాద్‌లో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. చార్మినార్‌ నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. గాంధీ భవన్‌, ఇందిరా విగ్రహం వరకు కొనసాగుతుంది. అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు.

ఆ తరువాత ఇందిరా గాంధీ విగ్రహం నుండి బోయిన్ పల్లిలో గాంధీ ఐడియాలజీ కేంద్రం, బాలానగర్, ముసాపేట, కూకట్ పల్లి, మియాపూర్, బెల్‌ మీదుగా పటాన్‌చెరుకు చేరుకుంటుంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ భారత్ జోడో యాత్ర జరగనుంది.ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది.

కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి తెలిపారు. మరోవైపుఇవాళ ఏపీలో 12కిలోమీటర్ల మేర సాగనుంది జోడో యాత్ర.అనంతపురం జిల్లాకు చేరుకున్న జోడోయాత్రకు జాజిరాపల్లిలో మార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు. అక్కడి నుంచి ఓబులాపురం వరకు సాగనుంది జోడో యాత్ర. సాయంత్రం తిరిగి కర్ణాటకతో ప్రవేశిస్తుంది భారత్‌ జోడో యాత్ర.

Tags

Next Story