Rahul Jodo Yatra: తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర ఫుల్ జోష్‌లో..

Rahul Jodo Yatra: తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. మూడో రోజు రాహుల్ పాతయాత్రలో ఫుల్ జోష్‌తో నడుస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో రైతుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు రాహుల్. దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ పంథాలోనే టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కూడా వెళ్తున్నాయని విమర్శించారు.
ఈ పార్టీలు బీజేపీకి ఆక్సిజన్ ఇస్తే అప్పుడప్పుడూ బీజేపీ ఆ పార్టీలకు బూస్టర్‌డోస్ ఇస్తుంటుందని సెటైర్ వేశారు. తెలంగాణ రాజకీయాల్లో తమకు రెండు కళ్లే ఉన్నా టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంల రూపంలో మూడు లక్ష్యాలున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మాత్రం తమకు, టీఆర్ ఎస్‌కు మధ్యనే పోటీ ఉంటుందన్నారు.
కాంగ్రెస్ లేకుండానే దేశంలోని ప్రతి పక్షాలను ఏకం చేస్తామంటూ కొందరు కలలు కంటున్నారని... అవి కలలుగానే మిగిలిపోతాయని కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని అన్నారు జైరాం రమేష్.
ఇక రాహుల్ షెడ్యూల్ చూస్తే..ఉదయం ఆరు గంటలకు మక్తల్ నుండి ప్రారంభమైన పాదయాత్ర చింతకుంట,లాల్ కోట చౌరస్తా, దేవరకద్ర మీదుగా గోపాల్‌పురం కలాన్ వరకు సాగుతుంది. అక్కడ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమై మన్యంకొండ వరకు సాగుతుంది.
అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. మూడో రోజు పాదయాత్ర దాదాపు 24 కిలో మీటర్లు సాగనుంది.ధర్మాపూర్‌లో రాహుల్ ఈ రాత్రి బస చేయనున్నారు.
మూడో రోజు 24 కిలోమీటర్లపాదయాత్రలో దారి పొడవున ప్రజలు, రైతులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలు, బీడీ కార్మికులతో మాట్లాడుతూ ముందుకు సాగనున్నారు.రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
రోడ్డుకు ఇరువైపులా నిల్చోని స్వాగతం పలుకుతున్నారు.. స్థానిక సమస్యలప వినతి పత్రాలు ఇస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాది హామీ కార్మికులకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్. భారత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com