RAIN: చినుకు పడితే వణుకుతున్న హైదరాబాద్‌

RAIN: చినుకు పడితే వణుకుతున్న హైదరాబాద్‌
X
భారీ వర్షం కురిస్తే మునిగిపోతున్న నగరం.. ప్రతీ వర్షానికి మునిగిపోతున్న చాలా ప్రాంతాలు... గంటల తరబడి బారులు తీరుతున్న వాహనాలు..

వర్షం కు­రి­స్తే నీట ము­ని­గిన కా­ల­నీ­లు, వరద నీ­టి­లో కొ­ట్టు­కు­పో­యి ప్రా­ణా­లు కో­ల్పో­యిన కు­టుం­బా­లు, జల­మ­య­మైన అనేక ప్రాం­తా­లు, కట్ట­లు తెగి ము­రి­కి నీ­రు­తో పొం­గి ప్ర­వ­హి­స్తు­న్న చె­రు­వు­లు.... ఇదీ హై­ద­రా­బా­ద్‌­లో ప్ర­స్తుత పరి­స్థి­తి. రెం­డు రో­జు­లు వర్షం పడి­తే చాలు భా­గ్య నగరం ము­ని­గి­పో­తోం­ది. వర్షాల వల్ల ఇంకా మర­ణా­లు సం­భ­వి­స్తుం­డ­డం ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. హై­ద­రా­బా­ద్​­లో వర్షం పడిం­దం­టే చాలు రో­డ్లు, కా­ల­నీ­లు చె­రు­వు­ల­ను తల­పి­స్తా­యి. నగ­రం­లో ఎక్కడ వర్షం పడి­నా­స­రే ఇదే తీరు కని­పి­స్తోం­ది. చి­న్న చి­ను­కు పడి­తే చాలు రో­డ్ల­పై నీరు ప్ర­వ­హి­స్తూ వా­హ­న­దా­రు­ల­కు, పా­దా­చా­రు­ల­కు తీ­వ్ర ఇబ్బం­దు­ల­ను కలి­గి­స్తుం­ది. 1908లో హై­ద­రా­బా­ద్ నగ­రా­ని­కి భారీ వర­ద­లు వచ్చి నగరం ము­ని­గి­న­ప్పు­డు వర­ద­ల­ను ని­వా­రిం­చేం­దు­కు అవ­స­ర­మైన ప్ర­ణా­ళి­క­ల­ను సూ­చిం­చా­ల్సిం­ది­గా మో­క్ష­గుం­డం వి­శ్వే­శ్వ­ర­య్య­ను ని­జాం కో­రా­రు.మూ­సీ­తో­పా­టు దాని ఉప­న­ది­గా ఉండే ఈసీ పై కొ­న్ని జలా­శ­యా­ల­ను ని­ర్మిం­చా­ల­ని ప్ర­తి­పా­ది­స్తూ వి­శ్వే­శ్వ­ర­య్య ఓ ప్ర­ణా­ళి­క­ను సి­ద్ధం చే­శా­రు. ము­రు­గు­నీ­టి పా­రు­ద­ల­కు అవ­స­ర­మైన సూ­చ­న­లు చే­శా­రు. అప్పు­డు ని­ర్మిం­చిన డ్రై­నే­జీ వ్య­వ­స్థే ఇప్ప­టి­కీ చాలా పటి­ష్టం­గా ఉంది అని బాల కి­ష­న్ అన్నా­రు. కా­క­పొ­తే, దీ­ని­ని పూ­ర్తి­గా పు­న­రు­ద్ధ­రిం­చ­డం కూడా ప్ర­స్తుత పరి­స్థి­తు­ల్లో సా­ధ్యం కాని పని అని ఆయన అం­టా­రు. డ్రై­నే­జీ వ్య­వ­స్థ పు­న­రు­ద్ధ­రణ లోపం వల్లే వర­ద­లు పో­టె­త్తు­తు­న్నా­య­ని అన్నా­రు.

బిక్కుబిక్కుమంటూ..

హై­ద­రా­బా­ద్​­లో ఇప్పు­డు­న్న నాలా వ్య­వ­స్థ రో­జు­కి 8 సెం­టీ­మీ­ట­ర్ల వర్షా­న్ని మా­త్ర­మే తట్టు­కో­గ­ల­దు. కా­స్త భారీ వర్షం పడి­తే చాలు లో­త­ట్టు ప్రాం­తా­ల­న్నీ పూ­ర్తి­గా జల­మ­యం కాగా, రో­జుల తర­బ­డి జనా­లు బు­ర­ద­లో బి­క్కు­బి­క్కు­మం­టూ బతు­కు­తా­రు. హై­ద­రా­బా­ద్​­లో ఇప్పు­డు­న్న నాలా వ్య­వ­స్థ రో­జు­కి 8 సెం­టీ­మీ­ట­ర్ల వర్షా­న్ని మా­త్ర­మే తట్టు­కో­గ­ల­దు. కానీ 2020 అక్టో­బ­రు నె­ల­లో మా­త్రం ఒక్క­రో­జే 19.2 సెం­టీ­మీ­ట­ర్ల వర్షం కు­రి­సిం­ది. దీం­తో హై­ద­రా­బా­ద్​ లో­త­ట్టు ప్రాం­తా­ల­న్నీ పూ­ర్తి­గా జల­మ­యం కాగా, రో­జుల తర­బ­డి జనా­లు బు­ర­ద­లో బి­క్కు­బి­క్కు­మం­టూ బతి­కా­రు. వర్ష­పు నీటి సమ­స్య ప్ర­తి ఏడా­ది ఉత్ప­న్న­మ­వు­తూ­నే ఉంది. ఈ సమ­స్య­కు పూ­ర్తి పరి­ష్కా­రా­న్ని కను­గొ­నేం­దు­కు నగ­ర­పా­లక పరి­పా­లన, పట్ట­ణా­భి­వృ­ద్ధి శాఖ కా­ర్యా­చ­రణ ప్ర­ణా­ళి­క­ల­ను రూ­పొం­ది­స్తోం­ది. ఇది ఎప్పు­డు అమలు చే­స్తా­రో చూ­డా­లి.

Tags

Next Story