Hyderabad Rain : హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం

Hyderabad Rain హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పొద్దంతా ఎండతో మాడు పగలగొట్టిన సూర్యుడు.. సాయంత్రానికి చల్లబడ్డాడు. సాయంత్రం హైదరాబాద్‌లోని పలు చోట్ల ఓ మోస్తారు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మలక్‌పేట్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, చంద్రాయణ గుట్ట, పహాడీ షరీఫ్‌లో తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
మరోవైపు వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, బాటసింగారంలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతవరణ పరిస్థితులు మారిపోవడం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు.
ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. 2 ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. అలాగే ఢిల్లీ, ముంబయి నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com