Weather - Rains Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్..!

తెలంగాణకు రెయిన్ అలర్ట్ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.ఐదు రోజుల పాటు తెలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక హైదరాబాద్‌లో కూడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.అటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అటు భద్రాద్రి కొత్తగూడేం, ములుగు, మంచిర్యాల, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జిల్లాలో అత్యధికంగా నార్నూర్‌లో 126 మిల్లిమీటర్ల. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో దస్తురాబాద్ మండలంలో అత్యధికంగా 54.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇటు నిజామాబాద్ జిల్లాలో బోధన్ మండలంలో అత్యధికంగా 44 మిల్లిమీటర్లల వర్షపాతం నమోదు కాగా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఏన్కూరులో 21.6 మిల్లిమీటర్ల వర్షం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా అశ్వాపురంలో 60 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అయితేరాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నప్పటకీ చెరువులు,కుంటలు,ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీటి వరద వచ్చి చేరడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 286.50 మీటర్లుగానే ఉంది. అలాగే మత్తడి వాగు ప్రాజెక్ట్‌కు, నిర్మల్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద మొఅయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా 5వేల114 క్యూసెక్కుల వరద వస్తోంది.
మరోవైపు తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో వేగంపెంచారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తితో పాటు వరి, మిర్చి నారుమళ్లకు నీరు అందుతున్నాయి. ఇక ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.నిన్న కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది నీళ్లు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com