TG: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

TG: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
వికారాబాద్ జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి... దేశంలోకి నైరుతు రుతుపవనాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు.. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన..... వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో....... ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణలో పలు చోట్ల ఇవాళ వర్షం పడింది. ‍వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడి.. ముగ్గురు మృతి చెందారు. జంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, లక్ష్మణప్ప వరి కోతకు పొలానికి వెళ్లి......... అక్కడ పిడుగుపడి మరణించారు. బెన్నూరు గ్రామంలో వెంకప్ప అనే వ్యక్తి పొలంలో ఎరువు చల్లటానికి వెళ్లి....... పిడుగుపాటుకు గురై విడిచాడు.

దేశంలోకి నైరుతు రుతుపవనాలు

దేశ వ్యవసాయానికి జీవనాడిగా పరిగణించే నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలోప్రవేశించాయి. నికోబార్ దీవుల మీదుగా......... నైరుతి రుతుపవనాలు ప్రయాణిస్తున్నట్లు భారత వాతావరణ విభాగం..తెలిపింది. మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవనాలు... మే 31 నాటికి కేరళను తాకనున్నట్లు... IMD వెల్లడించింది. గతేడాది జూన్ 8న, 2022లో మే 29, 2021లో జూన్ 3న నైరుతి రుతుపవనాలు........ కేరళను తాకాయి. లా నినా పరిస్థితులు, పసిఫిక్ మహాసముద్ర భూమధ్య రేఖ ప్రాంతం చల్లబడడం వంటి కారణాలతో....... ఈసారి భారత్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని I.M.Dఅంచనా వేసింది. లా నినా పరిస్థితులు దేశంలో మంచి వర్షాలు కురిసేందుకు.. సాయపడతాయని పేర్కొంది.

అన్నదాతల కష్టాలు

అన్నదాతను అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. నాలుగైదు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అవస్థ పడుతున్నారు. రోజంతా ధాన్యం ఆరబెట్టడం.. సాయంత్రానికి తిరిగి కుప్పలుగా వేయడమే తప్ప.. అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

Tags

Next Story