అలర్ట్ : మరో రెండ్రోజులు వర్షాలు.. !

హైదరాబాద్ నగరాన్ని అకాల వర్షం తడిసి ముద్ద చేసింది.. ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.. నిన్నమొన్నటి వరకు ఎండలతో చెమటలు కక్కుతున్న నగరవాసులు వర్షంతో సేదతీరారు.. సూరారం, బహదూర్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, చింతల్.. ఫతేనగర్, కొంపల్లి, బోయిన్‌పల్లిలో భారీ వర్షం కురిసింది.. కోర్ సిటీలో ఓ మోస్తరు వర్షం కురవగా.. శివార్లలో కుండపోత వాన పడింది.. సోమాజీగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
నిన్న అర్థరాత్రి కూడా నగరంలో భారీ వర్షం కురిసింది.. పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరం, దాని పరసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లుగా చెప్పారు.. దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన వున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లుగా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com