rains: భారీ వర్షాలకు జన జీవనం అతలాకుతలం

తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడె జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్శం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట... తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక, హైదరాబాద్లో కూడా రానున్న మూడు రోజులు ముసురు వాతావరణం ఉంటుందని... తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

నీట మునిగిన కరీంనగర్
భారీవర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తడిసి ముద్దవుతోంది. కరీంనగర్లో ఎడతెరిపి లేని వర్షానికి జగిత్యాల రహదారి నీట మునిగింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కరీంనగర్ శివారు ఆర్టీసీ వర్క్ షాప్ నుంచి జగిత్యాల వెళ్లే మార్గంలో కోటా కళాశాల ముందు భారీగా నీరు చేరి వాహనాలు నీటిలో మునిగాయి. ఓ మెకానిక్ షాప్ ముందు పార్కింగ్ చేసిన వాహనాల్లో ఒక కారు నీటిలో తెలియాడుతోంది. వాహనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా కారు స్టార్ట్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com