rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లోకి వరద నీరు చేరింది. రోడ్లు, ఫ్లైఓవర్లు వరద నీటితో పొంగిపొర్లుతూ సముద్రాన్ని తలపిస్తున్నాయి. పలు వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కి. మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రాజధానిలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. . నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లు కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో నిమ గ్నమయ్యాయయి. మాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్‌పల్లి, హాఫిజ్పేట్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచినట్లు హైడ్రా కంట్రోల్ రూంకు సమాచారం అందింది.
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, మలక్‌పేట్, చంచల్‌గూడ, ముషీరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఏపీలో జూలై 18 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com