RAINS: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశంలో మధ్యాహ్నం తరువాత మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 3 తరువాత పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీవర్షం మొదలైంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్, యూసఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్ వర్షం పడుతోంది. పంజాగుట్ట, శ్రీకృష్ణనగర్‌లో రహదారిపై వరద ప్రవహిస్తోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేటలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో శ్రీనగర్ కాలనీలో 9, ఖైరతాబాద్‌లో 8 సెంటీ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ వర్షాల కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. రహదారిపై భారీగా వర్షపు నీరు చేరి వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం, రహదారిపై వరదతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రాజ్‌భవన్ రహదారిలో మోకాళ్లలోతు వర్షపు నీరు చేరింది. రాజ్‌భవన్ రహదారిలో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. అమీర్‌పేటలో మోకాళ్ల లోతు వర్షపు నీటిలో వాహనదారుల అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్, మైత్రివనం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టింది. . యూసఫ్‌గూడ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో వర్షపు నీటితో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద కారణంగా మ్యాన్‌హోల్‌లు పొంగుతుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. బాలానగర్, కుత్బుల్లాపూర్, బండ్లగూడజాగీర్, జగద్గిరిగుట్ట, చింతల్, జీడిమెట్ల, గాజులరామారం, రాయదుర్గం, మాదాపూర్, కూకట్పల్లి, మూసాపేట, జేఎన్టీయూ, నిజాంపేట, కేపీహెచ్‌బీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడ్డది. వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు.. సోమాజిగూడ కూడలి వద్ద వాహనాలరాకపోకలు స్తంభించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com