Raja Singh Cases : రాజా సింగ్‌పై వందకు పైగానే కేసులు నమోదు..

Raja Singh Cases : పాత కేసుల్లో రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..మంగళ్‌హాట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు.. సెక్షన్ 502(2), 171-సీ రెడ్‌విత్, 171ఎఫ్, 123, 125 ఆర్పీ యాక్ట్ కింద రాజాసింగ్‌పై కేసులున్నాయి.. అలాగే షా ఇనాత్ గంజ్ పీఎస్ క్రైమ్ 71/2002 కేసులోనూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.. 153(ఏ), 295 (ఏ), 504,505/2 సెక్షన్ల కింద రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పాత కేసుల్లో ఆయన్ను అరెస్టు చేశారు మంగళ్‌హాట్ పోలీసులు.. ఫిబ్రవరి,ఏప్రిల్‌లో షాహినాత్ గంజ్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసులు నమోదయ్యాయి.. ఆ కేసులకు సంబంధించి 41 సీఆర్పీసీ కింద రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చారు.. 24 గంటల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, కొద్దిసేపటి క్రితం రాజాసింగ్ నివాసానికి వెళ్లిన మంగళ్‌హాట్ పోలీసులు.. అక్కడే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.. రాజాసింగ్ అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు మంగళ్‌హాట్ పోలీసులు ప్రకటించారు.ఇంటి నుంచి నేరుగా ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేసిన తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.. రాజాసింగ్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి... హైసెక్యూరిటీ మధ్య ఆయన్న అరెస్ట్ చేశారు.ఉద్దేశపూర్వకంగానే రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటున్నారు పోలీసులు. అటువంటి వ్యాఖ్యలు విధ్వంసానికి దారి తీస్తాయన్నారు. రాజాసింగ్ మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టారని... 2004 నుంచి 101 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. వీటిలో 18 మత ఘర్షణ కేసులు ఉన్నట్లు తెలిపారు.చాలా సార్లు ఒక మతాన్ని కించపరిచేలా రాజాసింగ్ మాట్లాడారని పోలీసులు తెలిపారు.
అంతకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వీడియో విడుదల చేశారు.. తన తాజా వీడియోలో టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై నిప్పులు చెరిగారు.. పాతబస్తీలో మత ఘర్షణలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.. టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు పన్నుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు.. తనను నగర బహిష్కరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారని, తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్లు రాజాసింగ్ స్పష్టం చేశారు.
అటు ఇప్పట్లో రాజాసింగ్ విడుదలవడం కష్టమే అనే మాట వినిపిస్తోంది.. అదీకాక తెలంగాణలో ఎమ్మెల్యేపై పీడీయాక్ట్ నమోదు కావడం మొట్టమొదటి సారి.మరోవైపు రాజాసింగ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బేగంబజారులో స్వచ్చందంగా బంద్ నిర్వహించారు వ్యాపారులు.బేగంబజారు, గన్‌ఫౌండ్రీ తదితర ప్రాంతాల్లో షాపులు మూసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టారు రాజాసింగ్ అనుచరులు. గోషామహాల్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు దుకాణాలు,హోటళ్లు,పెట్రోల్ పంపులు మూసివేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com