RAJASINGH:అందరి జాతకాలు బయటపెడతా

తనను అధిష్ఠానం సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు నోటీసులు ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజాసింగ్ స్పందించారు. నోటీసులు కాదు, కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానని, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని అన్నారు. ఇటీవల సొంత పార్టీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు ఆరోపణలను సమర్థిస్తూ, మంచి ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీపై గత కొంతకాలంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతోందని, రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం ఈ మేరకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వార్తలపై స్పందించిన రాజాసింగ్.. తనకు నోటీసులు ఇస్తే అందరి జాతకాలు బయట పెడతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరివల్ల పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజల ముందు ఉంచుతానని అన్నారు. నాకు నోటీసులు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం అందిందని.. నోటీసులు కాదని, కావాలంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని పేర్కొన్నారు.
రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కొడుకును కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈ కాల్స్ పై స్పందిస్తూ.. ఈ బెదిరింపులకు భయపడనని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోట్లాడాలని... రాజాసింగ్ సవాల్ విసిరారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న రాజాసింగ్.. ఒక ఫోన్ సంభాషణ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి బెదిరింపు కాల్స్, మెసేజెస్ ఎక్కువ అవడంతో.. భద్రతా సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగించుకోవాలని తెలంగాణ పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల వల్ల ఒంటరిగా బయట తిరగొద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీనిపైనా రాజాసింగ్ స్పందించారు. ధైర్యముంటే ఎదురుగా రావాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com