Rajya Sabha: రాజ్యసభలో సీట్లు ఖాళీ.. అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్‌ వ్యూహమేంటి?

Rajya Sabha: రాజ్యసభలో సీట్లు ఖాళీ.. అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్‌ వ్యూహమేంటి?
Rajya Sabha: బండ ప్రకాష్ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఉంది. ఇక వచ్చే నెలలో ఇద్దరి పదవీకాలం ముగియనుంది.

Rajya Sabha: బండ ప్రకాష్ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఉంది. ఇక వచ్చే నెలలో డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం ముగియనుంది. అయితే మూడు సీట్లకు ఒకేసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 19న నామినేషన్లకు చివరి తేదీ.. మే 30న పోలింగ్.. అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంఖ్యాబలం ఆధారంగా టీఆర్ఎస్‌కే రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉండటంతో.. పెద్దల సభకు వెళ్లేదెవరనే చర్చ జరుగుతోంది. ఒక్క సీటుకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఒక్క స్థానాన్ని కొత్త వారికి ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వ్యూహాలు రచించడంలో గులాబీ బాస్ కేసీఆర్ మహాదిట్ట.

నేషనల్ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. బంగారు భారత్‌ అనే నినాదంతో జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి తెరలేపారు. దీనిలో భాగంగా బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న తరుణంలో రాజ్యసభ కు వెళ్లే అభ్యర్థి విషయంలో కేసీఆర్ అనుహ్య నిర్ణయం తీసుకుంటారని పార్టీ లో చర్చ సాగుతోంది.

ఇప్పుడు తెలంగాణ నుంచి రాజ్యసభకు పార్టీ కానీ వాళ్ల పేరు వినిపిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే జరిగితే రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమైన ఆశావహుల్లో గండి పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పలువురు టిఆర్ఎస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు గా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు.. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీమంత్రి వెంకటేశ్వరరావులు రాజ్యసభకు వెళ్లేందుకు పోటీపడుతున్నారు.

ఇక ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ కాకుండా మాజీ లైన కర్నె ప్రభాకర్ , ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్ రావు లాంటి వారు కూడా రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చాలా కాలంగా ఏలాంటి పదవులు లేకుండా ఎదురు చూస్తున్నా పిఎల్ శ్రీనివాస్ తో పాటు దామోదర్ రావు, పలువురు పారిశ్రామిక వేత్తలు, మరికొంతమంది సీనియర్లు చివరి అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యులు లో ఉన్న సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని.. ఖాళీ అయిన బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనేది టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక అనూహ్య నిర్ణయాలతో సరి కొత్త పేర్లు చివరి నిమిషంలో కెసిఆర్ ఎంపిక చేస్తుండటంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story