rakhi:అనురాగం, ఆత్మీయత అంతా ఓ బూటకం

rakhi:అనురాగం, ఆత్మీయత అంతా ఓ బూటకం
X
అన్న వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టని వైఎస్ షర్మిల... కేటీఆర్‌కు రాఖీ కట్టని కల్వకుంట్ల కవిత.. కవిత రాఖీ కడుతుందనే హైద్రాబాద్‌లో లేని కేటీఆర్..! వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తున్న రాజకీయ వైరం

రా­జ­కీ­యా­లు వేరు, వ్య­క్తి­గత సం­బం­ధా­లు లేవు. రా­జ­కీ­యం­గా తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­సు­కు­ని ఎదుట పడి­తే ఆత్మీ­యం­గా ఉండే రా­జ­కీయ నే­త­లు తె­లు­గు రా­ష్ట్రా­ల్లో చా­లా­మం­ది ఉన్నా­రు. అలా­గే కు­టుం­బ­స­భ్యు­లు వే­ర్వే­రు పా­ర్టీ­ల్లో ఉన్నా.. తమ వ్య­క్తి­గత సం­బం­ధా­ల­ను మా­త్రం వదు­లు­కో­రు. వే­ర్వే­రు పా­ర్టీ­ల్లో ఉన్న నం­ద­మూ­రి బా­ల­కృ­ష్ణ, పు­రం­దే­శ్వ­రి రక్షా బం­ధ­న్ జరు­పు­తు­న్నా­రు. ఆ వీ­డి­యో సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్ అయిం­ది. బా­ల­కృ­ష్ణ టీ­డీ­పీ­లో ఎమ్మె­ల్యే­గా ఉంటే.. పు­రం­దే­శ్వ­రి బీ­జే­పీ­లో ఎం­పీ­గా ఉన్నా­రు. అయి­తే కొంత మంది రా­జ­కీయ నే­త­లు మా­త్రం ఈ గీ­త­ను చె­రి­పే­సు­కు­న్నా­రు. వ్య­క్తి­గత జీ­వి­తం­లో రా­జ­కీ­యా­ల­ను కలి­పే­సు­కు­ని తమకు వ్య­తి­రే­కి­స్తు­న్న కు­టుం­బ­స­భ్యు­ల­ను దూరం చే­సు­కు­న్నా­రు. వై­ఎ­స్ జగన్ జై­లు­లో ఉన్న­ప్పు­డు వై­ఎ­స్ షర్మిల రెం­డు తె­లు­గు­రా­ష్ట్రా­ల్లో మూడు వేల కి­లో­మీ­ట­ర్ల వరకూ పా­ద­యా­త్ర చే­శా­రు. అయి­తే ఆమె­కు పా­ర్టీ­లో ఎలాం­టి పదవి ఇవ్వ­లే­దు. అలా­గే ఎమ్మె­ల్సీ, రా­జ్య­సభ పదవి ఇవ్వ­లే­దు. ఎన్ని­క­ల్లో పోటీ చేసే అవ­కా­శం ఇవ్వ­లే­దు. తన­పై­నే రా­జ­కీ­యా­లు చే­స్తుం­దా అన్న కో­పం­తో జగన్ ఆమె­తో మా­ట్లా­డ­టం మా­నే­శా­రు. ఎం­త­గా అంటే.. చి­వ­రి­కి షర్మిల కు­మా­రు­డు.. అంటే మే­న­ల్లు­డు పె­ళ్లి­కి కూడా జగన్ వె­ళ్ల­లే­దు. ఎప్పు­డై­నా ఇం­టి­కి పి­లి­చి కొ­త్త­బ­ట్ట­లు పె­ట్ట­డం సం­ప్ర­దా­యా­ల­ను కూడా పా­టిం­చ­లే­దు. ఇద్ద­రి మధ్య ము­ఖా­లు కూడా చూ­సు­కో­నంత దూరం పె­రి­గిం­ది. గతం­లో రాఖీ పం­డుగ వద్ద అన్నా, చె­ల్లె­ళ్ల మధ్య అను­బం­ధా­న్ని వై­సీ­పీ­కి చెం­దిన నే­త­లు, మీ­డి­యా హై­లె­ట్ చే­సే­ది. ఇప్పు­డు షర్మిల ప్ర­స్తా­వన కూడా రా­వ­డం లేదు. రా­జ­కీ­యం పూ­ర్తి­గా వ్య­క్తి­గ­తం­గా తీ­సు­కో­వ­డం వల్ల.. వారి మధ్య దూరం పె­రి­గిం­ది. ప్రాం­తీయ పా­ర్టీ­ల్లో కు­టుం­బాల ఆధి­ప­త్యం ఉం­టుం­ది. ఆ కు­టుం­బా­ల్లో వి­బే­ధా­లు వస్తే పా­ర్టీ­ల­పై­నే ప్ర­భా­వం పడు­తుం­ది.

కేటీఆర్, కవిత మధ్య దూరం

బీ­ఆ­ర్ఎ­స్ వా­ర­సు­లు అయిన కే­టీ­ఆ­ర్, కవిత మధ్య కూడా ఇటీ­వ­లి కా­లం­లో పొ­స­గ­డం లేదు. వ్య­క్తి­గత సం­బం­ధా­లు బా­గుం­డా­లి. కానీ రా­జ­కీ­యం­గా కవిత తీ­సు­కు­న్న ని­ర్ణ­యం­తో కే­టీ­ఆ­ర్ .. కవిత వి­ష­యం­లో అంత సా­ను­కూ­లం­గా లేరు. ఇటీ­వల కే­టీ­ఆ­ర్ పు­ట్టిన రోజు నాడు కవిత సో­ష­ల్ మీ­డి­యా­లో హ్యా­పీ బర్త్ డే కే­టీ­ఆ­ర్ అన్నా అని ఆప్యా­యం­గా ట్వీ­ట్ పె­ట్టా­రు. కానీ కే­టీ­ఆ­ర్ నుం­చి రి­ప్ల­య్ లేదు. రాఖీ పం­డుగ రోజు.. కవిత వచ్చి రాఖీ కడ­తా­రే­మో అన్న ఉద్దే­శం­తో హై­ద­రా­బా­ద్ నుం­చి వె­ళ్లి­పో­యా­ర­ని రా­జ­కీ­య­వ­ర్గా­లు చె­బు­తు­న్నా­యి. ఇక్కడ కూడా వ్య­క్తి­గత , కు­టుంబ అం­శా­ల­కు రా­జ­కీ­యా­న్ని కలు­పు­కో­వ­డం­తో గ్యా­ప్ వచ్చే­సిం­ది. బీ­ఆ­ర్ఎ­స్, వై­సీ­పీల మధ్య అదే సా­రూ­ప్యత కని­పి­స్తోం­ది. ఆ పా­ర్టీ­లో ఇద్ద­రు కీలక నే­త­లు చె­ల్లె­ళ్ల­ను దూరం పె­ట్ట­డం వల్ల గం­ద­ర­గో­ళం పరి­స్థి­తు­లు ఏర్ప­డ్డా­యి. వై­సీ­పీ అధి­నే­త­కు పో­టీ­గా షర్మిల ఏపీ కాం­గ్రె­స్ అధ్య­క్షు­రా­లి బా­ధ్య­త­లు తీ­సు­కు­న్నా­రు. కవిత, షర్మి­ల­తో వైరం ఈ రెం­డు పా­ర్టీ­ల­ను ఎంత నష్టం కలి­గి­స్తుం­దో భవి­ష్య­త్తు­లో తే­ల­నుం­ది.

Tags

Next Story