Muchintal: రామానుజ స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను: రామ్‌నాథ్ కోవింద్

Muchintal: రామానుజ స్వర్ణ విగ్రహావిష్కరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజలు నిర్దేశించారని.. ఈ క్షేత్రం ఏర్పాటుతో తెలంగాణలో కొత్త సాంస్కృతికి వైభవం మొదలైందన్నారు. దేశంలోనూ కొత్త చరిత్ర మొదలైందందన్నారు రాష్ట్రపతి కోవింద్. భక్తితో ముక్తి లభిస్తుందని రామానుజులు ఆనాడే చెప్పారని.. దేవుడి దర్శనానికి.. పూజారి అవసరం లేదని చెప్పారన్నారు.
శ్రీరామనగరంలో సమానత్వం వెల్లివిరుస్తోందని.. అంబేద్కర్‌కు కూడా రామానుజల బోధనలు స్పూర్తి నిచ్చాయన్నారు రాష్ట్రపతి కోవింద్. అంతకుముందు.. రామానుజ సహస్త్రాబ్ది వేడుకల్లో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. రామానుజ స్వర్ణమూర్తి విగ్రహాన్ని లోకార్పణ చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. సతీసమేతంగా ముచ్చింతల్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు త్రిదండి చినజీయర్ స్వామి స్వాగతం పలికారు.
ఆయన్ను శ్రీరామనగరానికి ఆహ్వానించారు. ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. 120 కిలోల సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించిన అనంతరం అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు రాష్ట్రపతి.. దాదాపు రెండుగంటల పాటు దివ్యక్షేత్రంలోనే రాష్ట్రపతి గడపారు.
మరోవైపు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో చేరుకున్న రాష్ట్రపతికి.. ఘన స్వాగతం పలికారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్. అయితే.. బేగంపేటలో రాష్ట్రపతికి ఆహ్వానించిన సీఎం కేసీఆర్... ముచ్చింతల్‌కు వెళ్లలేదు. గతంలో ప్రధాని మోదీకి ఆహ్వానం పలకలేదు సీఎం కేసీఆర్. సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. హెలికాప్ట్టర్‌లో తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు రాష్ట్రపతి. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com