Ramadan 2023: సిద్ధమవుతోన్న హలీమ్ బట్టీలు...

Ramadan 2023: సిద్ధమవుతోన్న హలీమ్ బట్టీలు...
రంజాన్ కు సిద్ధమవుతున్న రాయల్ సిటీ; హలీమ్ బట్టీలను సిద్ధం చేస్తోన్న తయారీదార్లు..

పవిత్ర రంజాన్ మాసం కోసం ముస్లిమ్ సోదరులతో పాటూ యావత్ హైదరాబాద్ ఎదురు చూస్తూ ఉంటుంది. పాత బస్తీ వెలుగులు, ఇఫ్తార్ విందులతో ఓ 45 రోజులు నగరం మొత్తం వెలిగిపోతుంది అనడంలో సందేహమేలేదు. ఇక హలీమ్ కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే భోజన ప్రియులకు కొదవేలేదు. చిన్నా పెద్దలందరికీ అత్యంత ప్రియమైన ఈ రుచికరమైన వంటకానికి భారీ ఎత్తున ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మాసం, గోధుములు, మసాలా దినుసులతో తయారు చేసే ఈ వంటకం కోసం సాధారణ హోటల్స్ దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ అందరూ భారీ బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హలీమ్ బట్టీల నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ సారి హలీమ్ ధర గణనీయంగానే పెరిగేట్లు ఉందని తెలుస్తోంది. మాసం, గోధుమలు, నెయ్యితో పాటూ మసాలా దినుసుల ధరలు కూడా పెరిగిపోవడంతో హలీమ్ రేటు కూడా గట్టిగానే పెంచేందుకు హోటల్ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయినా సరే హలీమ్ కు డిమాండ్ ఏమాత్రం తగ్గేట్లు కనిపించడంలేదు. రుచికి రుచితో పాటూ ఆరోగ్యపరంగా హలీమ్ లో అన్ని పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి, ఎప్పటిలాగానే హలీమ్ ప్రియులు ఈసారి కూడా తమ ఫేవరెట్ డిష్ ను లాగించేందుకు రెడీగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story