RANGAM: మహమ్మారి వెంటాడుతోంది

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. ‘‘బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. మీ అరికాలిలో ముల్లు నాలుకతో తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను’’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
కొలిచే వారికి తోడుగా ఉంటా
"నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను.. నాకు రక్తం బలి కావాలి… నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడు తోడుగా నిలబడుతాను.. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త ఉండాలని చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు పెరుగుతాయని.. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయని చెప్పారు. ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలి.. నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది. అంతేకాదు నాకు రక్తం బలి ఇవ్వడం లేదు.. మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదు…. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు..నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు.. అందుకే మరణాలు పెరుగుతున్నాయి" అని మాతంగి చెప్పారు. అమ్మవారి ప్రశ్నలకు ఆలయ ప్రధానార్చకుడు సమాధానమిస్తూ.. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా తాము దగ్గరుండి పూజలు చేయిస్తున్నానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com